AP: గత ప్రభుత్వం చెత్త తీయలేదని, కానీ ప్రజలపై చెత్త పన్ను వేసి ఇబ్బందులకు గురి చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం తణుకులో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేసిందన్నారు. గత ప్రభుత్వం ప్రజల భూములను కొట్టేసేందుకు ప్రయత్నించిందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులపై పెత్తనం చేసే పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో భారీగా భూకబ్జాలు జరిగాయని, ప్రక్షాళన చేస్తున్నామన్నారు.