ప్రభుత్వం నిర్వహిస్తున్న 104 వాహన ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గురువారం చేబ్రోలు ఎంపీడీ వో కే. లలితకు 104 ఉద్యోగులు కార్యాలయంలో ఆమెకు వినతి పత్రం అందించారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించటం లేదని తమ కుటుంబాలు గడవడమే కష్టంగా ఉందని తమకు వేతనాలు అందే విధంగా కృషి చేయాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రాథమిక వైద్యశాల డాక్టర్ శైలజా పాల్గొన్నారు.