కూటమి ప్రభుత్వం రాష్ట్రoలో విద్యుత్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం పొన్నూరు పట్టణంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ ప్రదర్శన చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేసి అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు పోరుబాట ఆగదని సమన్వయకర్త అంబటి మురళి అన్నారు.