మండలంలోని ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చేబ్రోలు మండల తహసిల్దార్ శ్రీనివాస వర్మ అన్నారు. శుక్రవారం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వ సాధారణ బదిలీల్లో భాగంగా మేడికొండూరు మండలం నుంచి చేబ్రోలు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా వచ్చి అర్జీలు అందించవచ్చు అని సూచించారు. మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు.