పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన 13 ఏళ్ల మైనర్ బాలికను శనివారం ఆత్మకూరు గ్రామానికి చెందిన తాటి రూపేంద్ర ప్రభు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై కిడ్నాప్ చేశాడు. తండ్రి రాజు పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి విచారించి 24 గంటల్లోనే ముద్దాయిని పెదకాకాని శివారులో అదుపులోకి తీసుకున్నారు. బాలికను తండ్రికి అప్పజెప్పి ముద్దాయిని అరెస్టు చేశారు.