రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన కొనసాగిస్తుందని ముందున్న రోజులలో ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని జిల్లా వైసీపీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు అన్నారు. శుక్రవారం పొన్నూరు పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త అంబటి మురళి కృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు. విజయవాడలో డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసి మాజీ సీఎం వైఎస్ జగన్ పేరుని తొలగించటం అత్యంత హేయమైన చర్యని అభివర్ణించారు.