గుంటూరు జిల్లా పొన్నూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జిపిడిపి 2023-24 ఆర్థిక సంవత్సరమునకు గ్రామపంచాయతీ ప్రణాళికలు తయారీ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మండల ఎంపీడీవో భవనం మారుతి శేషమాంబ పాల్గొని మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో గ్రామపంచాయతీ ఉద్యోగులు, ఉన్నతాధికారులు గ్రామాలకు అవసరమైన ప్రజా మౌలిక వసతులపై సమగ్ర పరిశీలన చేసి నిధులు అవసరం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలని శిక్షణ కార్యక్రమంలో సూచించారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు, గతంలో ఆగిపోయిన ప్రస్తుతం అవసరమైన పనులపై గ్రామస్థాయిలో అధికారులు సమీక్ష జరిపి సమగ్ర నివేదికను మండల కార్యాలయానికి అందించాలని శిక్షణా కార్యక్రమంలో పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు తయారీ, తదితర అంశాలపై ఈఓపిఆర్డి శివసుబ్రహ్మణ్యం అవగాహన కల్పించారు. శిక్షణా కార్యక్రమంలో ఆయా గ్రామాల కు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.