ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో రామ్ చరణ్

80చూసినవారు
TG: మెగా హీరో రామ్ చరణ్ మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. రోల్స్ రాయ్స్ వాహనం కోసం రిజిస్ట్రేషన్ కు రావడంతో అక్కడ సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు ఉద్యోగులతో పాటు వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన వారు కూడా ఎగబడ్డారు. చరణ్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చరణ్ రిజిస్ట్రేషన్ ఫారాలపై సంతకాలు చేసి ఆర్టీఏ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్