ప్రతిపాడు: గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి: వనమా
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ అధ్యక్షతన గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వనమా బాల వజ్ర బాబు సమక్షంలో పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశo జరిగినది. కార్యక్రమంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పార్టీ విధి విధానాలపై చర్చించారు. డివిజన్ కార్పొరేటర్లు, ఇన్చార్జులు పాల్గొన్నారు.