విష్ణుప్రియ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

80చూసినవారు
విష్ణుప్రియ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
తనపై హైదరాబాద్‌లోని మియాపూర్‌తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లలో నమోదైన బెట్టింగ్ కేసులను క్వాష్ చేయాలని హైకోర్టులో యాంకర్ విష్ణుప్రియ పిటిషన్ వేశారు. పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు. బుధవారం విష్ణుప్రియ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగనుంది. కాగా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విష్ణుప్రియను నోటీసులు ఇచ్చిన పోలీసులు.. కీలక నిందితురాలిగా తేల్చారు.

సంబంధిత పోస్ట్