ప్రత్తిపాడు సిఎస్డిటిగా శివశంకర్ నియామకం..

71చూసినవారు
ప్రత్తిపాడు సిఎస్డిటిగా శివశంకర్ నియామకం..
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పౌర సరఫరా శాఖ (సిఎస్డిటి ) అధికారిగా శివశంకర్ సోమవారం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ బదిలీల్లో భాగంగా ప్రతిపాడు మండలానికి బదిలీ అయినట్లు ఆయన తెలిపారు. మండలంలో సంక్షేమ పథకాలు తదితర పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన పద్మజ గుంటూరుకు బదిలీ అయినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్