నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కోరారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నందు సోమవారం నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు, కాకుమాను మండలాలకు చెందిన కార్యకర్తలతో బాలసాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు అన్ని విధాల సహకారాలు అందిస్తామని తెలిపారు.