ప్రత్తిపాడు గ్రామంలో మంగళవారం ఎస్ఐ నాగేంద్ర విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించి గ్రామంలో ర్యాలీ ప్రదర్శన చేశారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ తీయరాదని మెసేజ్ లు, ముఖ్యంగా ఆడపిల్లలు ఫోటోలు పెట్టరాదని సూచించారు. సైబర్ క్రైమ్ వివిధ అంశాలను వివరించి అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.