టీట్కో గృహాల రుణాలు రద్దు చేయాలి

60చూసినవారు
టీట్కో గృహాల రుణాలు రద్దు చేయాలి
ప్రత్తిపాడు నియోజకవర్గంలో దివ్యాంగులకు కేటాయించిన టిట్కో గృహాల రుణాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని శనివారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుకు ఆయన కార్యాలయంలో ఆశయ సాధిక దివ్యాంగుల సొసైటీ సభ్యులు వినతిపత్రం అందించారు. ట్రాన్స్ జెండర్స్ కూడా టీట్కో గృహాలు ఇవ్వాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే బూర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్