బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారడంతో నిజాంపట్నం హార్బర్‌లో 1వ ప్రమాద సూచిక ఎగరేసారు. మత్స్యకారులకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యశాఖ అధికారులు ఆదేశించారు. ఎవరైనా సముద్రంలో ఉన్నా వెంటనే బయటకు రావాలని కోరారు. తుఫాను తీరం దాటుతున్నందున బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.