అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని రేపల్లె ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. రేపల్లె రూరల్ మండలం లంకవానిదిబ్బ గ్రామంలోని తుఫాన్ షెల్టర్ సమీపంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో సిఐ ఆర్. దివాకర్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మద్యం అమ్ముతున్న విశ్వనాథపల్లి రాముడును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుండి 16 క్వార్టర్ బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.