వరద బాధితులకు గూడవల్లి లోని వనజాచంద్ర స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు నిత్యవసర సరుకులను అందజేశారు. శనివారం కొల్లూరు మండలం శివరామ పురంలో ముంపుకు గురైన 50 కుటుంబాలకు 30 వేల రూపాయలు విలువ చేసే నిత్యవసర వస్తువులను అందజేసినట్లు వనజా చంద్ర పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయిని శ్వేత తెలిపారు. విపత్తు సమయంలో మానవతా దృక్పథంతో స్పందించిన విద్యార్థులు, ఉపాధ్యాయుల,కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.