రేపల్లెలో కుటుంబ కలహాలతో వివాహిత మృతి

64చూసినవారు
రేపల్లెలో కుటుంబ కలహాలతో వివాహిత మృతి
కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత మృతి చెందిన సంఘటన ఆదివారం రేపల్లె రూరల్ మండలం పిరాట్లంక గ్రామంలో జరిగింది. విరాట్ లంక గ్రామానికి చెందిన తోట శివనాగులు(30) తన భర్త రాజేష్ తో గొడవపడి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చౌడాయపాలెం ఎస్సై జ్యోతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్