నిజాంపట్నంలో పోలీసుల పల్లె నిద్ర

60చూసినవారు
నిజాంపట్నంలో పోలీసుల పల్లె నిద్ర
గ్రామాలలో శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పల్లెనిద్ర కార్యక్రమాన్ని రూప కల్పన చేశారని నిజాంపట్నం ఎస్సై తిరుపతిరావు అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నిజాంపట్నం మండల పరిధిలోని బావాజీ పాలెం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. నూతన చట్టాలు, సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్