రాజుపాలెం మండలంలోని చౌటపాపాయపాలెంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శనివారం ప్రారంభించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు.