సత్తెనపల్లిలో రైతుల కోరిక మేరకు పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో లక్ష్మీ ట్రేడింగ్ కంపెనీలో పత్తి కొనుగోళ్లు జరగనున్నాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కేంద్రాలలో గిట్టుబాటు ధరతో పత్తి కొనుగోలు చేస్తున్నారని, రైతులందరూ పత్తి కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.