చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ప్రారంభం

67చూసినవారు
చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ప్రారంభం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని నందిగామ నందు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ రమాదేవి బుధవారం ప్రారంభం చేసారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేయాలని తెలిపారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు సన్మానం చేసారు. పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ సిఓ మాడెబోయిన గురు ప్రసాద్, ట్రైనర్ బొల్లయ్య, సచివాలయం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్