మన టీడీపీ యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ కంటెంట్ ప్రజల్లోకి తీసుకెళ్లి టాప్ పెర్ఫార్మగా నిలిచిన కార్యకర్తలకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శనివారం ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. కార్యకర్తలు రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా టీడీపీ కార్యకర్తలను కట్టడి చేసినా నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు.