తాడేపల్లి: మానవత్వం చాటుకున్న మంత్రి సవిత
తాడేపల్లి పరిధిలోని కొలనుకొండ హైవే సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళుతున్న మంత్రి సవిత తన సొంత కాన్వాయ్ లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని తరలించేందుకు తన వాహనాలు వెళ్లడంతో మంత్రి సవిత నడుచుకుంటూ ఇంటికి వెళ్లారు. దీంతో పలువురు మంత్రి సవితపై ప్రశంసలు కురిపిస్తున్నారు.