వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మురళీకృష్ణంరాజు
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో గురువారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు వైసీపీలో చేరారు. ఈ మేరకు జగన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటి వరకు అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా మురళీకృష్ణ రాజు ఉన్నారు.