ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. కాలిపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీస్ (వీడియో)

58చూసినవారు
ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఆ మంటల్లో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని కాపాడారు. ఈ ఘటన తాజాగా గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. గ్రెనో ప్రాంతంలోని ఓ ఇంట్లో సిలిండర్‌ పేలి భారీ మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. ఈ క్రమంలో స్థానిక ఎస్సై అతడికి అంటుకున్న మంటలను ఆర్పి కాపాడాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్