తుళ్ళూరు మండలంలోని వెలగపూడిలో వృద్ధురాలి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపి నందిగం సురేశ్ ను తుళ్ళూరు పోలీసులు కస్టడీకి కోరారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులు కస్టడీకి అనుమతి ఇస్తూ మంగళగిరి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం, ఆదివారం నందిగం సురేశ్ ను తుళ్ళూరు పోలీసులు విచారించనున్నారు.