జనసేన పార్టీ సిద్ధాంతాలను నచ్చి పలువురు పార్టీలో చేరడం శుభ పరిణామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మాజీ కౌన్సిలర్, తెనాలి వీవర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాడు దామర్ల విజయరాణి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు మంత్రి నాదెండ్ల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి సూచించారు.