సంబంధంలేని వివాదాలలో తమకుటుంబాన్ని ఇరికించి ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కౌన్సిలర్ ఝాన్సీవాణి ఆరోపించారు. తెనాలి ఐతానగర్ కు చెందిన అబ్రహం కుటుంబానికి సంబంధించి ఆస్తి వివాదాల నేపథ్యంలో కౌన్సిలర్ సురేంద్ర, వీరయ్య, బాలయ్యపై ప్రజాధర్బార్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుసుకుని బుధవారం ఖండించారు. ఈగొడవతో తమకు ఎలాంటి ప్రమేయం లేదని, భర్త సురేంద్ర మరి కొందరిపై ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేశారన్నారు.