రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వానికి అమ్మాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. కొల్లిపర మండలం వల్లభాపురంలో బుధవారం ఆర్ఎస్కే పరిధిలో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించవచ్చని మంత్రి అన్నారు.