మాచవరం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ పై ఫిర్యాదు
వెల్దుర్తి హెడ్ కానిస్టేబుల్ అశోక్ బాబుపై పిన్నెల్లి గ్రామానికి చెందిన సత్తార్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. మాచవరం పోలీస్ స్టేషన్ లో అశోక్ బాబు పనిచేసిన సమయంలో వైసీపీ నేతల పేరు చెప్పి అనేకమంది నుంచి డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. తనను బెదిరించి రూ. లక్ష వసూలు చేశాడని తెలిపారు. ఇటీవల మాచవరం నుంచి అశోక్ బాబు వెల్దుర్తికి బదిలీ అయ్యాడని, పోలీసు చేయాలని బాధితుడు కోరారు.