భట్టిప్రోలు గ్రామానికి చెందిన బదూరుల్ల బేగ్ అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి మంజూరు చేసుకున్న నేపద్యంలో మంజూరైన 90 వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కును గురువారం వేమూరులోని క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే ఆనందబాబు బాధితుడికి అందజేశారు. ఆపద సమయంలో సీఎం సహాయనిధి పేద ప్రజలకు బాసటగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆనందబాబు తెలిపారు. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.