కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామంలో ఇటీవల తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన బాధితులకు బుధవారం ఎమ్మెల్యే ఆనందబాబు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు చూపు వలన పెను ప్రమాదం తప్పిందని ఎమ్మెల్యే ఆనందబాబు తెలియజేశారు. గత పాలకుల నిర్లక్ష్యమే వరదలు అని ఆయన విమర్శించారు.