కొల్లూరు మండలంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను గురువారం ఆర్డీఓ రామలక్ష్మి తనిఖీ చేశారు. అరవింద వారధి, అనంతవరం, చిలుమూరు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా కాకుండా చూడాలని అన్నారు. ఆమె వెంట రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఉన్నారు.