సంత్ సేవాలాల్ మహారాజ్ బాటలోనే సీఎం చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. వినుకొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై ఎస్టీ నాయకులతో ఆదివారం ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కు గుడి, సామాజిక భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటిని గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన పాల్గొన్నారు.