నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు రైతులకు భరోసా ఇచ్చారు. గత శనివారం కురిసిన అకాల వర్షంతో ఈపూరు మండలం కొండ్రముట్లలో దెబ్బతిన్న వరి పంటను జీవీ వ్యవసాయ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంట వివరాలను సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించాలని జీవి అధికారులను ఆదేశించారు.