రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు కోసం దరఖాస్తులను సమర్పించడానికి గురువారం చివరి తేదీ అని బుధవారం వినుకొండ తహశీల్దార్ సురేశ్ అన్నారు. బూత్ లెవెల్ అధికారుల వద్ద ఉన్న ఓటర్ల జాబితాలో తమ వివరాలను ధృవీకరించుకొని, ఏమైనా చేర్పులు ఉన్నా, పై తెలిపిన కారణముల వలన ఓట్లు తొలగించాలన్నా, ఓటరు జాబితాలో సవరణలు చేయలన్నా గురువారం సాయంత్రం లోపు తెలపాలని కోరారు.