AP: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఓ మహిళ గుండెను తరలించారు. గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిన్ డెడ్ అయ్యారు. అవయవదానం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో గుంటూరు నుంచి గుండెను తిరుపతికి తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆస్పత్రి యాజమాన్యం లోకేశ్‌కు విజ్ఞప్తి చేసింది.