ఏపీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

52చూసినవారు
ఏపీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
AP: బాపట్ల జిల్లాలోని పంగులూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. సెల్ ఫోన్‌లో మాట్లాడుతోందని తల్లి మందలించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. బుధవాడ గ్రామానికి చెందిన ప్రవల్లిక అనే అమ్మాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివింది. అయితే ఆ అమ్మాయి ఫోన్‌లో మాట్లాడుతోందని ఇంట్లో వాళ్లు మందలించడంతో మనస్థాపన గురై, బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్