AP: నాగార్జున యూనివర్సిటీ హాస్టల్ శుక్రవారం మధ్యాహ్నం పెట్టిన సాంబారులో కప్ప వచ్చిందని విద్యార్థినులు ఆరోపించారు. నిన్న రాత్రి వసతి గృహం వద్ద విద్యార్థినులు ధర్నాకు దిగారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థినుల వసతి గృహ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మెస్ కాంట్రాక్టర్‌గా ఉన్న వార్డెన్‌పై విచారణ చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.