నేడు, రేపు ఏపీలో విస్తారంగా వర్షాలు

62చూసినవారు
నేడు, రేపు ఏపీలో విస్తారంగా వర్షాలు
ఏపీలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్