నేడు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

185588చూసినవారు
నేడు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్