భారీ వర్షాల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లను జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు రెవెన్యూ డివిజినల్ అధికారి, అనకాపల్లి, నర్సీపట్నం కార్యాలయాలలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ల ద్వారా ఎవరైనా సహాయం పొందవచ్చునని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూం ఫోన్ నెంబర్లు 08924-226599, 08924-222888 గా ప్రకటించారు.