బుడమేరు పరివాహక ప్రాంతాల్లో మరోసారి అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. బుడమేరులో వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. దీంతో వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర 2.7 అడుగులకు నీటిమట్టం చేరింది. ఎలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, సింగ్‌నగర్, గుణదల, రామవరప్పాడు ప్రాంతాలకు మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది.