ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి పార్థసారథి అన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో హౌసింగ్‌పై నేడు మంత్రి సమీక్ష నిర్వహించారు. పీఎంఈవై మొదటి దశలో కేటాయించిన 70 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అందుబాటులో ఉన్న ఇసుకను హౌసింగ్ డిపార్ట్మెంట్‌కు ఇవ్వాలన్నారు. ఇసుక ట్రాన్స్ఫార్మెంట్‌ను హౌసింగ్ విభాగమే చెల్లించేలా ఆదేశించామని చెప్పారు.