పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా 15 సంవత్సరాల దీర్ఘకాల పెట్టుబడి పథకం. ఈ పథకంలో మెచ్యూరిటీ కంటే ముందే పెట్టుబడులు పూర్తిగా ఉపసంహరించుకోలేరు. ఖాతా తెరిచిన ఏడో సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రాలను అనుమతిస్తారు. ఖాతా తెరిచిన మూడో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు రుణం తీసుకోవచ్చు. ఖాతాలో కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా ఏడాదికి రూ.1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. ఈ ఖాతాలో వార్షిక వడ్డీ 7.1 శాతంగా ఉంది.