యూపీలోని కాన్పూర్లో ఓ మైనర్పై ప్రముఖ కోచింగ్ సెంటర్కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు నెలల తరబడి అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేశారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని 2022లో పరీక్షకు సిద్ధమయ్యేందుకు కాన్పూర్ వెళ్లింది. ఈ క్రమంలో బయాలజీ టీచర్ 32 ఏళ్ల సాహిల్ సిద్ధిఖీ, కెమిస్ట్రీ టీచర్ 39 ఏళ్ల వికాస్ పోర్వాల్ తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు.