శాశ్వత పందిళ్లలో తీగజాతి కూరగాయలు సాగు చేయడం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎకరా విస్తీర్ణంలో పందిరి నిర్మాణానికి 10 అడుగుల పొడవు, 6.8 అంగుళాల మందం కలిగిన రాతిస్తంభాలు లేదా సిమెంటు దిమ్మలు అవసరమవుతాయి. అదే వరుసల మధ్య 18 అడుగులు, స్తంభాల మధ్య 14 అడుగులు ఎడం ఉంచినట్లయితే 188 సిమెంటు దిమ్మలు అవసరం. 8 గేజ్ జింక్ పూత కలిగిన జిఐ తీగ 600 కిలోలు, 10 గేజ్ జిఐ తీగ 900 కిలోలు అవసరం అవుతుంది.