AP: హోటళ్లు త్వరగా మూసివేయడంతో తమ వ్యాపారాలు ఆర్థికంగా కొంత మేర నష్టపోతున్నామని, సమయం పొడిగించాలని హోటల్ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. దీంతో మంత్రి దుర్గేష్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతించే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీ టూరిజంను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్. దీనికి సంబంధించి త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నారు.