విమాన ప్రమాదానికి ముందు రేడియోకాల్‌ ద్వారా హెచ్చరిక

68చూసినవారు
విమాన ప్రమాదానికి ముందు రేడియోకాల్‌ ద్వారా హెచ్చరిక
అమెరికా రాజధాని వాషింగ్టన్‌ సమీపంలో అమెరికన్‌ ఈగల్‌ ఫ్లైట్‌ 5342 - ఆర్మీ హెలికాప్టర్‌ ఢీకొన్న ఘటనలో మరిన్ని కీలక విషయాలు బయటపడుతున్నాయి. విమానం, హెలికాప్టర్‌ ఢీకొనడాకి ముందు రేడియోకాల్‌ ద్వారా హెచ్చరించడం జరిగింది. ‘మీ ముందు విమానం వస్తోంది కన్పిస్తుందా?’ అని రేడియో కాల్‌ పంపించిన క్షణాల్లోనే ఈ ప్రమాద ఘటన జరిగింది. కేవలం 30 సెకన్లలో వ్యవధిలోనే అంతా జరిగిపోయింది. విమానం రెండు ముక్కలై నదిలో కూలిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్